ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు

ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు

చౌటకూర్, : చౌటకూర్ మండలంలోని శివంపేట, చౌటకూర్ తదితర గ్రామాల్లో కొత్తగా సాగు చేసిన ఆయిల్‌పామ్ తోటలను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి పి. సోమేశ్వరరావు, మండల ఉద్యాన అధికారి సమత శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆయిల్‌పామ్ తోటల్లో ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కలుపు యాజమాన్యం, డ్రిప్‌ నిర్వహణ, అంతర పంటల సాగు తదితర అంశాలపై వివరించారు. తోటలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తూ మొక్కల పెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి పి. సోమేశ్వరరావు కోరారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పథకంలో భాగంగా ఎకరాకు ఆయిల్‌పామ్ మొక్కలకు రూ.11,600, డ్రిప్‌ పరికరాలకు రూ.20,000, ఎరువులు, పురుగుమందులు, అంతర పంటల సాగుకు కలిపి రూ.16,800 రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.24,025గా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు వైవిధ్య పంటల సాగు చేపట్టాలని, నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ఇతర సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని పి. సోమేశ్వరరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫినోలెక్స్ డ్రిప్ కంపెనీ అధికారులు మహేష్, రాజకుమార్, రైతులు కిష్టయ్య, మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ