ఈ నెల 15 న, సింగరేణిలో BMS ఆందోళన మెమోరాండం
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించాలి.బీ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్.
భూపాలపల్లి : కార్మికుల లాభాల వాట 40% చెల్లించాలి సింగరేణి 2025-26 సంవత్సరానికి 58, మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లుగా సింగరెణి కార్మికుల చమట చుక్కలు సుమారుగా రూ; 2 వేల కోట్లకు పైగా నికర లాభాలు వచ్చినట్లుగా అనదికారికంగా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం సింగరేణి గత లబాల్లో మోసం, సింగరేణి గత సంవత్సరం రూ;2360 కోట్ల లాభాలు చూపిస్తూ మిగిలిన వాస్తవ లాభాలను దాచేస్తున్నారు. నిజానికి నికర లాభాలు 6394 కోట్లు వస్తే, అందులో 4034 కోట్లను సంస్థ అభివృద్ధి పేరిట పక్కన పెట్టారు. 6394 కోట్లలో కేవలం 819 కోట్లు కార్మికులకు పంచడం కేవలం 12.8% మాత్రమే ఇస్తున్నారు. కార్మికులను మోసం చేసిన రేవంత్ రెడ్డి బట్టి విక్రమక్క సర్కార్ కు లొంగిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చేసిన నాటి స్పష్టమైన మోసం. సింగరేణి లాబాల వాట ప్రకటనల్లో తర్చారం ఎందుకు...! సింగరేణి సంస్థ 2025-26 సంవత్సరానికి 58, మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని కార్మికులు సాదించి తెచ్చిన లాబాలను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే వస్తావా లాబాలను ప్రకటించాలి సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికుల వాట 40% ప్రకటించి కార్మికులకు పంచాలి, సింగరెణి కార్మికులను మభ్యపెట్టి, వారి కష్టార్జితాన్ని ప్రభుత్వం సింగరేణి వందల, వేల కోట్లను అభివృద్ధి భుచిపెరుతో కాంగ్రెస్ ప్రభుత్వ భుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క రాజకీయ కనుసన్నల్లో సింగరేణి నిదుల మళ్లింపుతో బారిగా కార్మికుల లాబాల వాట తగ్గింపుకు మరో కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోది. సింగరేణి లాభాల పై గతంలో మాదిరిగా అన్యాయం చేసి మల్లి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పోరాట పోజులతో కార్మికులను మోసం చేస్తున్నాయి. అదేవిదంగా మల్లి సింగరేణి లాభాల్లో అభివృద్ధి పేరుతో లాభాల్లో కోతలు విదించే కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్మికులను కోరుతూ ఈనెల 15 న అన్నీ గనుల మీద పెద్ద ఎత్తున నిరసన కార్మికులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


