ఎండుతున్న పంట పొలాలు

ఎండుతున్న పంట పొలాలు

కుర్దులింగంపల్లి గ్రామంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యతో  తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులు 

గంభీరావుపేట : గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలోని లో వోల్టెజ్ సమస్యను పరిష్కరించాలి అని రైతులు సోమవారం గంభీరావుపేట మండల పరిషత్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,కాలుతున్న మోటార్లు, ఎండుతున్న పంటలు, మరియు పది నిమిషాలకు ఒకసారి కాలుతున్న ట్రాన్స్ఫార్మర్ ఫీజు వైర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇనుప ట్రాన్స్ఫారం కావడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్వయంగా ఫీజు వైర్ వేసుకుంటున్న రైతులు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పై 30కి పైగా మోటార్లు  ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏడాది నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలుమండల పరిషత్ ఎదుట నిరసనతెలిపి ,కుర్దులింగంపల్లి ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్రంగా   ఇబ్బందులు పడుతున్నామని ప్రజావాణిలో అధికారుల ఎదుట  ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు ఈ కార్యక్రమంలో నేవూరి మహేష్ రెడ్డి, బోయనగారి రాజు, రమేష్ రెడ్డి, శ్రావణి, సంజీవరెడ్డి, సత్యం రెడ్డి, పిన్నింటి సోమిరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.

Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News