ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా చోటో ఖాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
సాయినపల్లి,తిమ్మాజిపేట విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేసిన అడిషనల్ ఎస్పీ
నాగర్ కర్నూల్ : బిజినపల్లి: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చోటో ఖాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు ఘనంగా జరిగాయి. అడిషనల్ ఎస్పీ రత్నం, అడిషనల్ ఏఆర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రతిభ చూపారు. బిజినపల్లి మండలం సాయినపల్లి గ్రామం నుండి 11 మంది, తిమ్మాజిపేట మండల కేజీబీవీ నుండి 8 మంది విద్యార్థులు డబుల్ గ్రేడ్ తో ప్రమోషన్ సాధించి గ్రీన్ బెల్ట్ కైవసం చేసుకున్నారు. అలాగే షైన్ పల్లి నుండి పలువురు విద్యార్థులు సీనియర్ బ్లూ, ఆరెంజ్, గ్రీన్, వైట్ నుండి ఎల్లో బెల్ట్ గ్రేడ్ లు సాధించారు. మాస్టర్స్ అలీ సిద్ధిక్, మాస్టర్ అష్వక్, మాస్టర్ జగన్ ల శిక్షణలో విద్యార్థులు ఈ ఘనత సాధించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ రత్నం, అడిషనల్ ఏఆర్ సురేష్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


