సింగరేణి బకాయిల సాధన కోసం ఈ నెల 30న ధర్నా
ధర్నాకు ఎస్‌ఎన్‌పీసీ కార్మికులు హాజరుకావాలని ప్రత్యేక ఆహ్వానం
నస్పూర్ (మంచిర్యాల): సింగరేణి బకాయిల సాధనతో పాటు సింగరేణి అభివృద్ధే లక్ష్యంగా ఈ నెల 30వ తేదీన సీసీసీ రోడ్డు వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో ‘సింగరేణి బకాయి బీజేపీ లడాయి’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహిం చనున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎన్‌పీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరుతూ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, మిట్టపల్లి మొగిలి కార్మికుల వద్దకు వెళ్లి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, బకాయిల సాధన, సంస్థ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


