రైతులు పంట వివ‌రాలు నమోదు చేసుకోవాలి:ఏ.ఓ సత్యనారాయణ..

రైతులు పంట వివ‌రాలు నమోదు చేసుకోవాలి:ఏ.ఓ సత్యనారాయణ..

 నాగార్జునసాగర్ పెద్దవూర మండలంలోని రైతులు తాము పండించిన పంటను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ అన్నారు.ఈసందర్భంగా మాట్లాడుతూ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమం మొదలైందని రైతులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టే సిబ్బందికి పూర్తి సహయ సహకారాలు అందించి తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. Lఎల్‌నినో ప్రభావం,వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.సన్న వరి రైతులకు బోనసు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పోడిగించినట్లు వెల్ల‌డించారు.ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ కేవలం ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వడ్లు బిపిటి – 5204, కెఎన్ హేచ్ – 1638,ఆర్ఎన్ఆర్ 15048,హెచ్ఎంటీ సోనా,కెఎన్ఎం 7715,జైశ్రీరాం,డబ్ల్యూజీఎల్-44 లకు మాత్రమే ఇస్తుందని తెలిపారు.రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన ఎరువుల దుకాణంలోనే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.సొంతంగా సన్నరకాల వడ్లు సాగు చేసుకునే రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.