పదవుల కోసం పాకులాడేవారు ఉద్యమకారులు కారు

పదవుల కోసం పాకులాడేవారు ఉద్యమకారులు కారు

ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేవాడే నిజమైన ఉద్యమకారుడు.

భూపాలపల్లి  పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ అధికారానికి దగ్గరవుతూ, తమను తాము ఉద్యమకారులుగా చెప్పుకునేవారు ప్రజలను వంచించడమే అవుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాధండి దేవేందర్ అన్నారు. ఉద్యమకారుడి ప్రధాన లక్ష్యం పదవి, అధికారం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడటమేనని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సందర్భానుసారంగా పార్టీలు మారుతూ, అదే సమయంలో “మేమే ఉద్యమకారులం” అంటూ ముసుగు వేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. పాలకులు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడం, ప్రజల సమస్యలపై పోరాడటం ఉద్యమకారుడి బాధ్యత అని దేవేందర్ అన్నారు.  ఉద్యమకారుడి విలువ అతను పొందిన పదవుల్లో కాదు.. ప్రజల కోసం నిలబడిన తీరులో ఉంటుందని స్పష్టం చేశారు. పదవి లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ, అధికారాన్ని ప్రశ్నిస్తూ, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడేవారే నిజమైన ఉద్యమకారులని అన్నారు. ప్రజలు కూడా వ్యక్తులు చెప్పుకునే పేర్లను కాకుండా వారి రాజకీయ ప్రయాణాన్ని, ప్రజా సమస్యలపై వారి వైఖరిని, వారి నిబద్ధతను పరిశీలించాలని దేవేందర్ సూచించారు. “పదవి కోసం ప్రజలను ఆశ్రయించేవాడు కాదు.. ప్రజల సమస్యల కోసం పదవిని సైతం పక్కన పెట్టి నిలబడేవాడే నిజమైన ఉద్యమకారుడు” అని రాధండి దేవేందర్ పేర్కొన్నారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News