కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ భారీ ధర్నా
ఎన్నికల కమిషనర్ తొలగింపునకు డిమాండ్
నాగర్‌కర్నూల్: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, 25 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ చర్యలు రాజ్యాంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, బీజేపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారని ఎమ్మెల్యేలు కసిరెడ్డి, రాజేష్ రెడ్డి విమర్శించారు. అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


