ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిరసన
బ్లాక్ షర్టులతో ఆందోళన.. మోదీ, జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మల దహనం
కామారెడ్డి, : ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత,యస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బ్లాక్ షర్టు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత, యస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


