మిడ్జిల్‌కు చెందిన డా. ఖాజా ఆరిఫ్‌కు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి
బోధన, పరిశోధన రంగాల్లో విశేష సేవలు.. మిడ్జిల్ ప్రాంత ప్రజల హర్షం
మిడ్జిల్, : మిడ్జిల్ మండలానికి చెందిన డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా సేవలందిస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్, బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వుల మేరకు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (CAS) కింద 12వ వేతన స్థాయి నుంచి 13ఏ వేతన స్థాయికి డా. ఖాజా ఆరిఫ్ పదోన్నతి పొందారు. డా. ఖాజా ఆరిఫ్ 2011 డిసెంబర్ 26న ప్రభుత్వ సర్వీసులో చేరారు. తొలుత కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అనంతరం హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిం చారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ఎం.వి.ఎస్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనిచేసి, ప్రస్తుతం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్నారు.బోధనా విధులతో పాటు సేంద్రియ సంశ్లేషణ, గ్రీన్ కెమిస్ట్రీ రంగాల్లో పరిశోధనలు కొనసాగిస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ మాట్లాడుతూ.. బోధన, పరిశోధన, విద్యార్థుల అభ్యున్నతి కోసం డా. ఖాజా ఆరిఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఆయనకు లభించిన పదోన్నతి కళాశాలకు గర్వకారణమని అన్నారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది డా. ఖాజా ఆరిఫ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదోన్నతి పట్ల మిడ్జిల్ ప్రాంత ప్రజలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


