అంగన్వాడీ, ఆశా వర్కర్లకు బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం
చేగుంట : భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్పం కార్యక్రమంలో భాగంగా సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు ఆశా వర్కర్లకు మాసాయిపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సమాజంలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలను బీజేపీ నాయకులు అభినందించి, వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల బీజేపీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఏశం నవీన్ యాదవ్, మండల BJYM అధ్యక్షులు గోగొండ విఠల్, బూత్ అధ్యక్షులు గౌరగాళ్ల రాములు, మండల కిసాన్ మోర్చా కార్యదర్శి ముక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు.సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలను గౌరవించడం, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


