నస్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మృతి
నస్పూర్ (మంచిర్యాల): మంచిర్యాల పట్టణం నస్పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు సమాచారం. బాధితులంతా మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


