మంచిర్యాల సీసీ నస్పూర్ రోడ్డు ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

మంచిర్యాల సీసీ నస్పూర్ రోడ్డు ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

నస్పూర్ (మంచిర్యాల): నస్పూర్ లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవళి, సోనియాగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ..ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని, నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో 
సీపీ తో పాటు డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ రవీందర్, అశోక్‌లతో పాటు పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News