మృతుని కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ పార్కల రాంరెడ్డి
- గంగోజిపేట మల్లేశం కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం
- పరామర్శించిన పలువురు కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు
చౌటాకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ కేంద్రంలో గ్రామంలో ఇటీవల మరణించిన గంగోజిపేట మల్లేశం కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి గారు స్వయంగా పరామర్శించి, ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న మల్లేశం కుటుంబ సభ్యులను కలుసుకుని ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ భరోసా కల్పించిన సర్పంచ్ పార్కల రాంరెడ్డి గారు.. తక్షణ ఖర్చుల నిమిత్తం తన వంతుగా రూ. 10,000/- (పదివేల రూపాయల) నగదును వారికి ఆర్థిక సాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి సర్పంచ్ ముందుకు రావడం పట్ల గ్రామస్తులు ఆయన సేవా దృక్పథాన్ని, ఉదారతను కొనియాడుతున్నారు.ఈ పరామర్శ మరియు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్కలా రమేష్, వార్డు మెంబర్లు జైపాల్ రెడ్డి, డప్పు అశోక్, గ్రామ సీనియర్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, కొన్యాల వీరేశం తదితరులు పాల్గొని
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


