ఉమ్మడి చెక్‌ పవర్‌పై కీలక మార్పులు

  •  వారంలో సంతకం చేయకపోతే కార్యదర్శికి అధికారం
  •  పదేపదే నిరాకరిస్తే చెక్‌ పవర్‌ రద్దుకు షోకాజ్‌ నోటీసులు

అక్కన్నపేట,  : నందారం సర్పంచ్ శ్రీలత బాలరాజుగ్రామ పంచాయతీల నిధుల వినియోగంలో అమలవుతున్న ఉమ్మడి చెక్‌ పవర్‌ నిబంధనల్లో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విధానం ప్రకారం పంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఇద్దరూ సంతకాలు చేస్తేనే చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా చెక్కులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పాటు పంచాయతీ సిబ్బందికి జీతభత్యాల చెల్లింపుల్లోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అని శ్రీలత బాలరాజు అన్నారు

వారంలో సంతకం తప్పనిసరి

కొత్తగా జారీ చేయనున్న ఉత్తర్వుల ప్రకారం ఉప సర్పంచ్‌లు చెక్కులపై వారంలోగా సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేయడానికి నిరాకరిస్తే అందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా సంతకం చేయకుండా ఉంటే, ఉప సర్పంచ్‌కు బదులుగా పంచాయతీ కార్యదర్శి సంతకంతో చెక్కులు ఆమోదం పొందేలా కలెక్టర్‌ అనుమతించే అవకాశం ఉంటుంది. అని శ్రీలత బాలరాజు పేర్కొన్నారు

పదేపదే నిరాకరిస్తే చెక్‌ పవర్‌ రద్దు

ఉప సర్పంచ్‌లు పదేపదే చెక్కులపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తే వారి చెక్‌ పవర్‌ను శాశ్వతంగా రద్దు చేసే చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకుని, ప్రస్తుత విధానంలోనే మార్పులు చేయాలని నిర్ణయించింది.నందారం సర్పంచ్‌ శ్రీలత బాలరాజు* మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం సజావుగా సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగించేలా ఉండాలని పేర్కొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.