వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలి
బిఆర్ఎస్ నాయకులు ఎన్.సి. సంతోష్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో చాకలి సోదరులు ఐక్యంగా ముందుకు వచ్చి, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత అభినందనీయమని బిఆర్ఎస్ నాయకులు ఎన్.సి. సంతోష్ కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించిన ధైర్యం, ఆత్మగౌరవం కోసం చేసిన వీరోచిత పోరాటం మరియు సమాజాన్ని ఏకం చేసిన ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడంలో గజ్వేల్ చాకలి సోదరులు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారని పేర్కొన్నారు. ఐలమ్మ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశా నిర్దేశం చేస్తుందన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో తనను ఆత్మీయంగా సత్కరించి, జ్ఞాపికను అందించిన రజక సంఘం సోదరులందరికీ ఎన్.సి. సంతోష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకయ్య, బాలకృష్ణ, ప్రవీణ్, రామస్వామి, రాము, ప్రవీణ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


