స్థానికంగా పనిచేయని ఆశ వర్కర్
రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండలం దోసపల్లి గ్రామ సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సభలో గ్రామ అభివృద్ధికై పలు అంశాలు చర్చించారు. గ్రామ ఆశ వర్కర్ అనురాధ స్థానికంగా ఉండకుండా ఆమె వేరే వ్యక్తిని పెట్టి పనిచేపిస్తుందని, ఆమె మాత్రం నారాయణాఖేడ్ లో ఉంటూ గ్రామంలో ప్రజలను పట్టించుకోవడం లేదని సోమవారం గ్రామ ప్రజలు ఈ ఆశ వర్కర్ మాకు వద్దంటు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. పై అధికారులు వెంటనే స్పందించి ఆశ వర్కర్ ను మార్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.గ్రామ సభలో గ్రామ సర్పంచ్ అమర్ సింహ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు వెంకటేశం,షబ్బీర్,లక్ష్మి,పుతీలిబీ,పోచమ్మ,మండల యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు గురునాథ్ రెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 124
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
