అనుమతులు లేకుండా అక్రమ ప్లాట్లు
చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో పిర్యాదు
పెబ్బేరు : అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ క్రింద జరిగే మోసాన్ని, వెంచరును నిలపుదల చేయగలరని పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ ఉప సర్పంచ్ పెద్దింటి నందీశ్వర్, వార్డు సభ్యులు మాల సతీష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కావలి బాలస్వామి, పెబ్బేరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేష్,తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని సర్వే నెం:652, 653,654లలో మొత్తం భూమి విస్తీర్ణం 21ఎకరాల 16గుంటల భూమిలో ప్రభుత్వం నుండి “నాలా” అనుమతులు, డీటీసీపీ అనుమతులు లేకుండా “శ్రీ మారుతి ఆగ్రో ఫామ్స్" సంస్థవారు ఫామ్ పేరుతో భూమిని గుంటల రూపంలో ప్రజలకు విక్రయింపజేస్తున్నారు. ఇట్టి విషయంలో ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లు అమ్ముటకు చూస్తున్నారు.ఇట్టి ఫామ్ ల్యాండ్ పేరుతో ప్రజలకు గుంటల రూపంలో అమ్మి రిజిస్ట్రేషన్ చేయుటకు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే అట్టి వెంచర్ కు తీసుకున్న భూమి నీటి మునకలో ఉన్నది ఎక్కువగా వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు అట్టి పొలం నీటి మునకకు గురవుతుందని కావున పై తెలిపిన సంస్థ చేస్తున్న మోసాన్ని అరికట్టి అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ క్రింద జరిగే మోసాన్ని,వెంచరును నిలపుదల చేయగలరని వారు విజ్ఞప్తి చేశారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
