చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు

చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు

వనపర్తి : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన 98 జీఓను తక్షణమే అమలు చేసి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిం చారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించా లని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. 98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామ స్వామి పాల్గొని నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రహదారి నిబంధనలు రహదారి నిబంధనలు
మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుమల్ల వైకుంఠం ఆధ్వర్యంలో రహదారి నిబంధనలు, భద్రతపై విద్యార్థులకు...
దేశవ్యాప్త జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి
జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో ఎంజేపీ దౌల్తాబాద్‌ సత్తా
చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
 ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట లక్ష్మీకాంతారావు బాధ్యతల స్వీకరణ