శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
బెల్లంపల్లి / మంచిర్యాల: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు, చిన్నారులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా పోతరాజుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనాల పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏజీఎం అరవింద్‌రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, ప్రిన్సిపాల్ సంజీవ్, డీన్ ప్రదీప్, ప్రైమరీ ప్రిన్సిపాల్స్ సౌజన్య, పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.
Views: 80
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
