విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.

విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.

శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని  పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే ఉద్దేశంతో Student Council Elections నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని, ప్రజాస్వామ్య పద్ధతులు, ఓటు హక్కు, నాయకత్వ బాధ్యతలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయులు శ్రీహర్ష, శ్రీనివాస్, సమీ, భారతి, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుత నాయకత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News