ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్ లో ఘనంగా ఓనం ఉత్సవాలు

ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్ లో ఘనంగా ఓనం ఉత్సవాలు

 

నాగర్ కర్నూలు/బిజినపల్లి  :నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్ నందు ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జోసెఫ్, రీతా* మాట్లాడుతూ... ఓనం ఉత్సవాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా జరుపుకుంటారని అన్నారు.అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోసెఫ్ మాట్లాడుతూ... ఓనం పండుగకు ఉన్న పురాణ కథను వివరించారు. పురాణ కథ ప్రకారం మహాబలి చక్రవర్తి చాలా దయగల, న్యాయవంతుడైన రాజు. ఆయన పాలనలో అందరూ సమానంగా, సంతోషంగా ఉండేవారు. విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి మూడు అడుగుల స్థలం అడిగి, రెండు అడుగులతో భూమి ఆకాశాన్ని కొలిచి, మూడో అడుగుకి మహాబలి తలను అడిగాడు. మహాబలి భక్తికి మెచ్చి ఏడాదికి ఒకసారి తన ప్రజలను చూడటానికి రావచ్చని వరం ఇచ్చాడు. ఆ తిరిగి వచ్చే రోజే ఓనం అని నమ్మకంతో ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో ఘనంగా వేడుకలను నిర్వహించారు. పూలతో అందమైన అత్తుపూకాలం వేసి సందడి చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
 
3
 
 
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు