సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి స్వయం ప్రకటనపై అభ్యంతరం

సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి స్వయం ప్రకటనపై అభ్యంతరం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని సర్పంచ్‌లకు, అలాగే జిల్లాలోని 32 మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక వ్యక్తి తానే జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. జిల్లాలోని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులందరి అభిప్రాయాలు, సమన్వయంలేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. 32 మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలకు గుర్తింపు లేదని తెలిపారు. జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డికి జిల్లాలోని అన్ని మండలాల సర్పంచ్‌ల మద్దతు ఉందని ఫోరం ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని 300 మందికి పైగా సర్పంచ్‌లు ఆయనకు అండగా ఉన్నారని, ఫోరం అధ్యక్షుడిగా ఆయనకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్‌ల ఫోరం నిరంతరం పనిచేస్తోందని మునిపల్లి సాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోరం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా గ్రామ పంచాయతీల సమస్యలు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఫోరం కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అదేవిధంగా జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్ వినయ్‌రెడ్డి, సునీల్‌రెడ్డి తదితరులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఫోరం ప్రతినిధులు తెలిపారు. సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచ్‌ల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఐక్యంగా ముందుకు సాగుతుందని మునిపల్లి సాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్ధన్, ఉపాధ్యక్షులు చింతం ఉమారాణి సంజీవ్, రూరల్ అధ్యక్షులు వాసు, ఇందల్వాయి అధ్యక్షులు సుదర్షన్, రావుట్ల అధ్యక్షులు భూమేశ్, దర్పల్లి అధ్యక్షులు శ్రీను, మోపాల్ అధ్యక్షులు జలేందర్, ఇడపల్లి అధ్యక్షులు రాజు, మోపాల్, బాల్కొండ అధ్యక్షులు మోహన్, మోస్రా అధ్యక్షులు నీలిమా సాయగౌడ్, మెండోరా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు దాదాపు 25 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా లేదా సర్పంచ్‌ ల ఫోరం అధ్యక్షుల సమ్మతి లేకుండా ఎవరైనా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి ప్రకటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మునిపల్లి సాయిరెడ్డి స్పష్టం చేశారు.

Views: 110

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News