నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి

నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి

  • ఒకరి నేతృదనంతో ఇద్దరికీ చూపు వస్తుంది
  • 41 వ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన కార్యక్రమం
  • జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ 

నాగర్ కర్నూల్ : నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ఒకరి నేత్రదానంతో ఇద్దరికీ చూపు వస్తుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ తెలిపారు. ఆగస్టు 25వ తారీకు నుండి సెప్టెంబర్ 8వ తారీకు వరకు 41వ నేత్రదాన  పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని, నేత్రదానం గురించి ప్రజలలో కల  అపోహలు తొలిగి , నేత్రదానం యొక్క ఆవశ్యకత  ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రధాన ఉద్దేశంతో నేత్రదాన పక్షోత్సవ అవగాహన  కార్యక్రమాల నిర్వహిస్తున్నామని డి ఎం హెచ్ వో డాక్టర్ కే కృష్ణ తెలిపారు. తేదీ 25/08/2026 మంగళవారం నాడు బిజినపల్లి మండలం పాలెం జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో  41 వ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన ర్యాలీని జెండా ఊపి డి ఎం హెచ్ వో డాక్టర్ కే కృష్ణ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు, సిబ్బంది, ప్రజలచే నేత్రదాన  ప్రతిజ్ఞను చేయించారు. తదనంతరం విద్యార్థులకు నేత్రదాన  ఆవశ్యకత గురించి డి ఎం హెచ్ ఓ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ కే కృష్ణ మాట్లాడుతూ  నేత్రదానం ప్రతి ఒక్కరి కుటుంబాలో సంప్రదాయంగా మారాలని, అందులకు చూపునివ్వాలని  తెలిపారు. కంటి కను పాపపై (నల్ల గుడ్డు)ఉండే తెల్లనిపొర ను కార్నియా అంటారు. కార్నియా ఇన్ఫెక్షన్స్ వల్ల, దెబ్బల, కంట్లో రసాయన పడటం  వల్ల, కార్నియా స్వచ్ఛత కోల్పోవడం ద్వారా అంధత్వానికి దారితీస్తుంది.
వ్యక్తి మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు నేత్రదానం చేయవచ్చును. అన్ని మతాల వాళ్ళు, స్త్రీ,పురుష బేధం లేకుండా నేత్రదానం ముందుగాప్రకటించినా,ప్రకటించకపోయినా ప్రతి ఒక్కరూ చేయవచ్చును. వ్యక్తి మరణించిన 6 గంటల లోపే నేత్రదానం చేయాలి, ఎవరైనా నేత్రదానం చేయాలంటే ఈ కింది  నెంబర్లను సంప్రదించండి. 
1. దత్తాత్రేయ రావు 781069034 
2. కొట్ర బాలాజీ 9440876556
3. భావండ్ల వెంకటేష్ 9440847599
నేత్రదానం చేయాలని అనుకునేవారు, వ్యక్తి మరణించిన తర్వాత వెంటనే  దగ్గర్లోని ఆరోగ్య సిబ్బందికి లేదా పై నెంబర్లకు కాల్ చేసి  తమ సమ్మతిని తెలియజేయాలి. మరణించిన వ్యక్తి తలకింద తలగడ ను నుంచి, రెండు కండ్లపై తడిపిన దూది ఉంచాలి, వీలైతే రూములో ఏసీ కానీ కూలర్ కానీ ఆన్ చేయాలి, ఫ్యాను వేయరాదు కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని  డిఎంహెచ్వో డాక్టర్ కే కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ బిఎంహెచ్వో డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక,గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, డిప్యూటీ సర్పంచ్ గోవింద్ శ్రీనివాసులు, జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, ఆప్తమిక్ ఆఫీసర్ దత్తాత్రీరావు, కొట్ర బాలాజీ, పర్యవేక్షకులు బాదం రాజేశ్వర్, సుజాత, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎంలు సరస్వతి, మల్లికా, ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు