హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు
శివంపేట (మెదక్): హరితహారం కార్యక్రమంలో భాగంగా గోమారం గ్రామ పంచాయతీ ఆవరణలో కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గోమారం గ్రామ సర్పంచ్ కుమ్మరి హైమావతి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్, గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యులు నాచారం నవనీత నాగరాజు, గ్రామ యువకులు నందనం నరేందర్, బండ శ్రీకాంత్, కుంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 17:27:19
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామాయంపేట వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని...
