మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు



సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో డీఎఫ్ఓ జోజి, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులతో కలిసితో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో వన మహోత్సవం కింద  31 లక్షల 95  మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు .19 లక్షల 43వేల 654 మొక్కలు నాటి 60.83శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు విద్యార్థినిలు అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు