శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వ అల్పాహారం పంపిణీ
టేకులపల్లి: ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని గ్రామ సర్పంచ్ బి. పూలబంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి. పూలబంతి స్వయంగా చిన్నారులకు అల్పాహారం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్యం, ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ కమల, పాఠశాల ఆయా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న అల్పాహారం, ఇతర సౌకర్యాలను వారు పరిశీలించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


