మాతృభాష బోధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఎంఈఓ అజయ్ కుమార్ వెల్లడి
నాంపల్లి,: మాతృభాష బోధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని నాంపల్లి ఎంఈఓ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి హైస్కూల్లో నిర్వహించిన తెలుగు కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి చదవటం రాయటం తప్పనిసరి చేస్తూ ఇటీవల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిందని దీనిలో భాగంగా వెనకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతి బోధన ప్రతి పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని లక్ష్యసాధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర చాలా అవసరమని అందుకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ మాతృభాష పట్ల అభిరుచిని పెంచుతూ ప్రభుత్వం నిర్దేశించ…
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


