మేరు సంఘం ఆధ్వర్యంలో సంత్ నాందేవ్ మహారాజ్ 676 వ పుణ్య తిథి వేడుకలు.

మేరు సంఘం ఆధ్వర్యంలో సంత్    నాందేవ్  మహారాజ్ 676 వ పుణ్య తిథి వేడుకలు.

కామారెడ్డి / బాన్సువాడ  : మేరు కుల గురువు పండరీపురం విటలేశ్వరు ని అగ్రేసర భక్తుడు శ్రీ సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ వారి 676 వ పుణ్య  తిథి కార్యక్రమం మంగళవారం మేరు సంఘం మండల కమిటీ ఆధ్వర్యం లో  మేరు సంఘం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా కిష్టాపూర్ రాములు  మహారాజు ఆధ్వర్యం లో వార్కారి భజన  చేయడం జరిగింది. అనంతరం గులాల్ పూజ అభిషేకం శ్రీరామ నామ దేవుని సంక్షిప్త జీవనగాత ప్రసాదం వితరణ మహా అన్నదాన ప్రసాదం నిర్వహించడం జరిగింది. సంత్ నాందేవ్ మహారాజ్  పండరీపురం లో గుడిమెట్ల పైన ఆషాడ శుక్ల త్రయోదశి నాడు సమాధి చెందారని. విఠలేశ్వరు నిపై వేల అభంగాలు సిక్కు భాష లో 65 అబంగాలు రాసి వారి కి కూడా గురువయ్యరని  నాందేవ్ మారాజు గొప్ప సంఘసంస్కర్త షింపి మేరు కులం లో పుట్టిన గొప్ప మానవతావాద ని మేరు సంఘం మండల అధ్యక్షుడు వీటురి హనుమాన్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో మేరు సంఘ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News