రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం....ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి....

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం....ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి....


 నాగార్జునసాగర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ముందుకు పోతున్నామని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు.సోమవారం పెద్దవూర మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు, సాగునీరు, పంటల కొనుగోలు తదితర అంశాల్లో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని,ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు,కుట్రలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు.రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. పిఎసిఎస్ లలో రైతులకు ఆర్థికంగా,వ్యవసాయపరంగా అండగా నిలిచే కీలక సంస్థలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రైతులకు రుణాలు,వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు సకాలంలో అందేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు.రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి.శేఖర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుంటక వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి కృష్ణ నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పబ్బు యాదగిరి గౌడ్,తహసీల్ధార్ ఖాసీం,ఎంపీడీవో ఉమాదేవి, పిఎసిఎస్ సీఈఓ వెంకట్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు పిఏసిఎస్ డైరెక్టర్లు,పిఎసిఎస్ కార్యాలయ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News