సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డి
పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి
చౌటకూర్,: తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చౌటకూర్ మండలం సరాఫ్‌పల్లి గ్రామ సర్పంచ్ నందికంటి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్, తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సర్పంచుల సంఘం ప్రతినిధులు రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి రామచంద్రారెడ్డికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం సంఘం మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.గతేడాది డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చౌటకూర్ మండలం సరాఫ్‌పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నందికంటి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సన్నిహితుడిగా ఆయన కొనసాగుతున్నారు.జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన సర్పంచుల సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


