గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పవిత్రవాణి పేరు పరిశీలన 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పవిత్రవాణి పేరు పరిశీలన 

హైదరాబాద్: తెలంగాణలో నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె, వైద్యురాలు పవిత్రవాణి పేరును ఒక స్థానానికి పరిశీలిస్తున్నట్లుతాజా సమాచారం.  పవిత్రవాణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. ఇటీవల సిరిసిల్లలో జరిగిన సభలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పిస్తామ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పవిత్రవాణి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని రేవంత్‌రెడ్డి గతంలోనూ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నేపథ్యం ఉన్న పలువురికి పదవులు కల్పించిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్ సభ్యత్వం కల్పించినట్లు పేర్కొంటున్నాయి.  ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం నవంబర్ 14న ముగియనుంది. దీంతో మూడు స్థానాల భర్తీపై కాంగ్రెస్‌లో ఆశావహుల మధ్య పోటీ నెలకొంది.  మరోవైపు, మూడు స్థానాల్లో కనీసం రెండు స్థానాలను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా ఇద్దరు బీసీ నేతలకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ నేపథ్యంలో పవిత్రవాణి ఎంపికపై చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆమె పేరుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ