శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన చేసిన అభివృద్ధి ప్రజల గుండెల నుంచి తీయలేరు

శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన చేసిన అభివృద్ధి ప్రజల గుండెల నుంచి తీయలేరు

బిఆర్ఎస్ నాయకుల స్పష్టం

మక్తల్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వము చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి వాటిని తొలగించలేరని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న అనుమంతు మాజీ కౌన్సిలర్లు అన్వర్  జగ్గలి రాములు ఎరుకలి మొగిలపలు స్పష్టం చేశారు. స్థానిక పెద్ద చెరువు కట్టపై 2023వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తో పాటు అప్పటి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ స్థానిక శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు వెల్కం బోర్డు తో పాటు వివిధ అభివృద్ధిల కోసం 20 లక్షల కేటాయించిన శిలాఫలకాని ధ్వంసం చేయడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంస్కృతి మక్తల్ నియోజకవర్గం లో ఎప్పుడు లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కృతి రోజురోజుకు పెరుగుతుందని వారు తెలిపారు. రెండు నెలల కిందట రహిమానా కాలనీలో ఇదేవిధంగా శిలాఫలా కానీ ధ్వంసం చేయడం జరిగిందని ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని వారు అన్నారు. ఇప్పటికైనా శిలాఫలకాలు అనే ధ్వంసం చేసి చేసిన అభివృద్ధిని ప్రజల గుండెల నుంచి తీసివేస్తామంటే అది ఎవరికి సాధ్యం కాదని వారు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ మున్సిపాలిటీ కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అంతకుముందు శిలాఫలకం ధ్వంసం చేసిన స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్ కుమార్,గవినోల నరసింహారెడ్డి, శివారెడ్డి, ఈశ్వర్ యాదవ్,అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News