దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతికి తల్లిదండ్రుల సహకారం అవసరం శ్రీనివాసరెడ్డి

దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతికి తల్లిదండ్రుల సహకారం అవసరం శ్రీనివాసరెడ్డి

నిజామాబాద్ : దివ్యాంగ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో పెంచి, ఉన్నతంగా తీర్చిదిద్దాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. తారకరామనగర్‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని అంధుల ప్రత్యేక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. స్నేహ సొసైటీ విద్యార్థుల క్రమశిక్షణ, అభ్యున్నతికి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం లోకల్ ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్‌గా మాల కొండయ్య, వైస్ చైర్మన్‌గా కనకయ్య, టీచర్ కన్వీనర్‌గా వెంకటేష్, సభ్యులుగా అనురాధ, హరి కిరణ్ నాయక్ ఎన్నికయ్యారు. కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాళ్లు ఎస్. జ్యోతి, రాజేశ్వరి, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News