మహిళా సంఘాల బలోపేతానికి కృషి.: ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి.

మహిళా సంఘాల బలోపేతానికి కృషి.: ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి.

నాగార్జునసాగర్ : మండలంలో స్వయం సహాయక మహిళ సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు.పెద్దవూర మండలం నిమ్మనాయక్ తండ గ్రామపం చాయతీలోని బెట్టలతండలో సోమవారం మహిళ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ,వారి ఆర్థిక,సామాజిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అన్నారు.మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని,మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు.మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు.మాజీ జడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి,నిమ్మ నాయక్ తండ గ్రామ సర్పంచ్ బాబు రమావత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి,నందికొండ కౌన్సిలర్ పగడాల నాగరాజు,మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి-కృష్ణ నాయక్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు నారాయణ,ఏపిఎం రాందాస్,వివిధ గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News