వివో ఏలు కోల్పోయిన వేతనాలు వెంటనే చెల్లించాలి..
- కులం పేరుతో దూషించి దాడి చేసిన అమర్నాథ్ అరెస్టు చేయాలి.......
- కలెక్టరేట్ ధర్నాలో ఎండి సలీం హెచ్చరిక.
నాగార్జునసాగర్ :గుర్రంపొడ్ మండలంలో ఏపిఎం సీసీల నిర్లక్ష్యంతో వివో ఏలు కోల్పోయిన నాలుగు లక్షల 35 వేల వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం,యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ లు డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ గుర్రంపోడు మండలం లో 2025 సెప్టెంబర్ నుండి 2026 సెప్టెంబర్ వరకు ఏపీఎం సీసీల నిర్లక్ష్యంతో గ్రేడింగ్ కొట్టకపోవడం వల్ల 87 సార్లు నాలుగు లక్షల 35 వేల వేతనాలు కోల్పోయారని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకనే 26 రోజులుగా సమ్మె చేస్తున్నారని అన్నారు.ఈ సమ్మెను ఇలానే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరింత పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామంలో వివోఏ గా పనిచేసిన గనిపెల్లి మాధవి పైన అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త కుప్పల అమర్నాథ్ కులం పేరుతో దూషించి దాడి చేయడం ఏమైనా చర్యని అతను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.వివో ఎల కు పని భారాన్ని పెంచి ఏపిఎం సీసీలు వేధిస్తున్నారని వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని అన్నారు.ఈకార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పొడిచేటి సులోచన, సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ వెంకన్న, కోశాధికారి చంద్రకళ జిల్లా నాయకులు రేణుక మంత్రాల మంగమ్మ, ఎడవెల్లి పాపయ్య, రమావత్ దశరథ లక్ష్మి సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

