ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • - ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..
  • డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,

ఆదిలాబాద్ బ్యూరో :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీ జి ఎస్ ఆర్ టీ సి డిపో వద్ద ఘనంగా ప్రచార సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన ఐ ఎన్ టి యు సి, ఎస్ డబ్ల్యూ యు, టీ ఎం యు, ఎస్ డబ్ల్యూ ఎఫ్,కూటమి) అభ్యర్థి  మొగుళ్ల రాజిరెడ్డి  తరఫున నిర్వహించిన ఈ ప్రచార సభలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లు కంది శ్రీనివాస్ రెడ్డి, గజేందర్  లతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్ లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్ లు మాట్లాడుతూ... గత పదేళ్ల పాలనలో రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసే ఆర్టీసీ కార్మికులు సమయానికి వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతినెల 1వ తేదీనే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లిస్తూ వారి సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలలో మెజారిటీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని, విలీనంతో పాటు మిగిలిన డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంస్థ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి  మొగుళ్ల రాజిరెడ్డి 'బాణం' గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ ప్రచార సభలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, , ఆత్మ కమిటీ చైర్మన్లు గిమ్మ సంతోష్, రాజు యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజార్ పాషా, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, ఎన్ టీ యు సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, అలాగే బండి దేవిదాస్ చారి, బెజ్జంకి అనిల్ కుమార్, గౌలి సంజీవ్ కుమార్, కృష్ణారెడ్డి తదితర నాయకులు, కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ