నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..

  •  ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు.. జూదంపై కఠిన చర్యలు
  •  ప్రతి గ్రామంలో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలి.
  •  విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,
  • సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఆధ్వర్యంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజా భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్, మిస్సింగ్ కేసుల ఛేదనతో పాటు ఎన్‌బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్‌కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని అన్నారు. నిజమైన దోషులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి, అవసరమైన చోట ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ఆర్థిక, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ  అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానాస్పద లావాదేవీలు, మోసాలపై ప్రజలకు తగిన సూచనలు అందించాలని తెలిపారు.జూదం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా జూదం నిర్వహిస్తున్నట్లు లేదా ఆడుతున్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జూదం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నాయని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే జూదాన్ని అరికట్టేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ  సూచించారు. మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు మహిళా చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.దుర్గా నవరాత్రుల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ  అధికారులను ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన మేరకు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర నిఘా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు, యువతతో పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. రౌడీషీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఉత్సవాలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు తదితర కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు.విధి నిర్వహణలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందిని గుర్తించి రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం సిఫారసు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కే. నర్సింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, గట్టుమల్లు, విజయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళి, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, రైటర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-05 at 4.30.22 PM (1)

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ