సిద్దిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి
సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి గ్రామ స్టేజి వద్ద సోమవారం దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలా సత్తయ్య అనే వ్యక్తి గ్రామ స్టేజి వద్ద ఉన్న ఒక హోటల్‌లో టీ తాగి, అనంతరం తన స్కూటీపై రోడ్డు దాటుతుండగా, సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఢీకొన్న తీవ్రతకు సత్తయ్య తలకు తీవ్ర గాయమై, తల పగిలిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


