బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా ఇంద్రసేనారెడ్డి

బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా ఇంద్రసేనారెడ్డి

హనుమకొండ న్యూస్ : హనుమకొండ జిల్లా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా అధికార ప్రతినిధిగా నరహరి ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, బీజేపీ పార్టీ ని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ఇంద్రసేనారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇంద్రసేనారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు, సంస్థాగతంగా బీజేవైఎంను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News