బిజినపల్లి PHC మెడికల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు

బిజినపల్లి PHC మెడికల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు

 జిల్లా నాగర్ కర్నూల్ :NHM మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెకు నోటీసును బిజినపల్లి PHC మెడికల్ ఆఫీసర్ కు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 వేల మంది NHM మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తున్నామని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి సేవలు అందించామని తెలిపారు. రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత, వేతన సమస్యల పరిష్కారం కోసం ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించలేదన్నారు. అందుకే NHM మరియు ఔట్ సోర్సింగ్ JAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 12 వరకు శాంతియుత నిరసనలు, ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 13 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. ప్రజలకు అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News