ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?

ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?

మల్లంపల్లి (ములుగు)కాంగ్రెస్ నాయకులు రాజకీయ దిగజారుడుతనంపై బి ఆర్ ఎస్  మండల సాధన సమితి నాయకుడు  కుక్కల సంపత్  ఘాటు కౌంటర్ మల్లంపల్లి: మల్లంపల్లి మండల సాధన కోసం పోరాడిన విప్లవకారులు, ఉద్యమకారులపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండల ఉద్యమకారులు తీవ్రంగా మండిపడ్డారు. “మల్లంపల్లి మండల సాధన ఉద్యమం ఎన్ని దశల్లో ప్రారంభమైంది? దానిని ఎవరు ప్రారంభించారు? ఆ లక్ష్య సాధన కోసం ఎవరు ఎంతగా కష్టపడ్డారు? ప్రాణాలకు సైతం తెగించి ఎవరు పోరాటాలు చేశారో ఈ ప్రాంత ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. అంతేకాకుండా, మల్లంపల్లి మండల సాధన సమితి వేదిక ఎప్పుడు ఏర్పడింది? ఎవరెవరితో కలిసి ఏర్పడింది? మండల సాధనలో ఆ వేదిక పోషించిన కీలక పాత్ర ఎంతటిది? అనే విషయాలు కూడా ప్రజలందరికీ బాగా తెలుసు. ఉద్యమం తీవ్రరూపం దాల్చి, విజయం సాధించే దిశగా పయనిస్తున్న తరుణంలో... వేరే గత్యంతరం లేక, తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే మీ పార్టీ నాయకులు మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు చేపట్టిన ఉద్యమంలోకి వచ్చి భాగస్వామ్యమయ్యారనేది బహిరంగ రహస్యం” అని ఈ సందర్భంగా ఉద్యమకారులు గుర్తుచేశారు. “పదవుల కోసం మోసానికి, బానిసత్వానికి ఊడిగం చేయకుండా ఎదురు తిరిగిన వారిని విమర్శిస్తే ఏదో ఒక పదవి దక్కుతుందని భావించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం” అని వారు ఘాటుగా వ్యాఖ్యానించారు. మా  మండల సాధన ఉద్యమ స్ఫూర్తి మల్లంపల్లి రాజకీయ నాయకులుకు ప్రజలకు మేధావులకు సబ్బండ వర్గాలకు తెలుసు! మల్లంపల్లి రాజకీయాల్లో  మా ఉద్యమకారుల రాజకీయ ప్రస్థానం   ప్రజలకు తెలుసని, మేము ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడతాము.. పదవుల కోసం పాకులాడే చరిత్ర మాకు లేదు. ప్రజల కోసం పోరాడిన ఉద్యమకారులపై చౌకబారు విమర్శలు చేస్తే మల్లంపల్లి ప్రజలు వాస్తవాలను గుర్తు చేసుకుంటారు” అని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉద్యమకారులను బెదిరిస్తూ, పోరాటాలపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నందుకు... కాంగ్రెస్ పార్టీ మీ కష్టాన్ని గుర్తించి 'అధికారికంగా' ఏదో ఒక పదవి ఇస్తుందని ఆశిస్తున్నామంటూ ఉద్యమకారులు వ్యంగ్యంగా ముగించారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్ పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
దేవత్ పల్లి లో సర్వేనెంబర్ 111 లో భూములు పరిశీలించిన చండూర్ ఆర్డీవో
తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు