ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కార్మికుల హక్కుల కోసం ఐక్య కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపు
హన్మకొండ న్యూస్ : తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సోమవారం హనుమకొండ బస్టాండ్‌లో, స్థానిక డిపో–2లో ఆర్టీసీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను కలిసి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం నిరంతరం పోరాడే నాయకత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే నాగరాజు గారు కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్టీసీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి కార్మికుల ప్రయోజనాలను కాపాడే యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీసీ నాయకులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


