చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్

చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్

చిలిపిచెడ్, మెదక్ జిల్లా: నూతనంగా ఏర్పడిన చిలిపిచెడ్ మండల తహసీల్దార్ కార్యాలయం కోసం కింది స్థాయి అధికారులు పంపిన ప్రపోజల్ లో తప్పుల తడకలు బయటపడ్డాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి, తప్పుడు రిపోర్ట్ పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ జూల అనిల్ డిమాండ్ చేశారు. శీలంపల్లి గేటు వద్ద తహసీల్దార్ కార్యాలయం కోసం పంపిన ప్రపోజల్ లో పొజిషన్ ను తప్పుగా చూపించారని ఆరోపణ. అసలు పొజిషన్ మాధవ రెడ్డి గారిది అయితే, దుష్యంత్ రెడ్డి, ధర్మారెడ్డి, భూపాల్ రెడ్డి లది అని తప్పుగా నమోదు చేసి పంపారని తెలిపారు. అంతేకాకుండా, గతంలో రైతు వేదిక కోసం కేటాయించిన 20 గుంటల భూమిలో నుండి 10 గుంటలను తహసీల్దార్ కార్యాలయానికి చూపించడం, R&B రోడ్డుకు నిబంధనల ప్రకారం వదలాల్సిన స్థలాన్ని వదలకుండా కేవలం సెంటర్ నుండి 20 ఫీట్లు మాత్రమే వదిలి ప్రపోజల్ పంపడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్య వివరించగా కలెక్టర్ గారు స్పందించి స్వయంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాననిహామీఇచ్చారనీ సర్పంచ్ అనిల్ తెలిపారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ