చర్లలో అర్ధరాత్రి దొంగతనం యత్నం

ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

చర్లలో అర్ధరాత్రి దొంగతనం యత్నం

దొంగతనంకి పాల్పడ్డ బాలుడు (పోలీస్ స్టేషన్లో)

చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):  చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో అర్ధరాత్రి వేళ దొంగలు హల్‌చల్ చేశారు, అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకోగా, మరొకరు పరారయ్యారు బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అంబేద్కర్ సెంటర్‌లోని  కేకే నిలయం కాంపౌండ్‌లోకి సోమవారం అర్ధరాత్రి సుమారు 12:10 గంటల సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు చొరబడ్డారు, వారు తెచ్చుకున్న ఐరన్ రాడ్డుతో ఇంటి తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించారు, ఆ సమయంలో చప్పుడు రావడంతో అదే కాంపౌండ్‌లో నివాసముంటున్న వ్యక్తులకు అనుమానం వచ్చి దొంగ దొంగ  అని గట్టిగా కేకలు వేశారు స్థానికుల కేకలతో భయాందోళనకు గురైన సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు, ఇందులో ఇద్దరు పక్కనే ఉన్న గూడూరి కృష్ణమూర్తి ఇంటీ కాంపౌండ్ వాల్ దూకి, మెయిన్ గేటు దాటుకుంటూ అంబేద్కర్ విగ్రహం వైపు పరిగెత్తారు బాధితులు, స్థానికులు అతడిని వెంటాడే క్రమంలో, గస్తీ తిరుగుతున్న పోలీసులు ఎదురై అడ్డుకోవడంతో స్థానికులకు సదరు వ్యక్తి  (దొంగ) దొరికిపోయాడు, పట్టుబడిన వ్యక్తి వయస్సు సుమారు 15 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. సదరు వ్యక్తికి తెలుగు, హిందీ భాషలు రాకపోవడంతో అతని వివరాలు స్పష్టంగా తెలియరాలేదు , చత్తీస్గడ్  రాష్ట్రం పామేడు పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది, మరో దొంగ అంబేద్కర్ సెంటర్‌లోని గౌతమి డిగ్రీ కళాశాల ప్రధాన గేటు దూకి లోపలికి ప్రవేశించి, చీకట్లోకి పరారయ్యాడు, పట్టుబడిన మైనర్ దొంగను రాత్రి సుమారు 1:00 గంట సమయంలో స్థానికులు చర్ల పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు

ప్రజల్లో పెరిగిన ఆందోళనWhatsApp Image 2026-10-06 at 7.57.13 AM

తాళం  పలగ కొట్టేందుకు ఉపయోగించిన  ఇనుప రాడ్డు

చర్ల మండలంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నార, ఇటీవల కాలంలో  చర్లలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలను సైతం అపహరించినట్లు సమాచారం, అర్ధరాత్రి నివాస ప్రాంతాల్లోకి చొరబడి దొంగతనాలకు యత్నిస్తుండటంతో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత తీవ్రతరం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Image 2026-10-06 at 7.58.30 AM

పక్క కాంపౌండ్ గోడ ఎక్కి పారిపోయిన ప్రదేశం..

 

Views: 569

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News