వేములవాడకు చేరుకున్న కల్వకుంట్ల కవిత.. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
వేములవాడ :ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోకి అడుగుపెట్టిన ఆమెకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేణులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.పట్టణానికి చేరుకున్న అనంతరం ఆమె నేరుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు పూర్తయిన తర్వాత, మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యాచరణ గురించి ఆమె మాట్లాడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


