బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
వెంకటాపురం మండలం లో ప్రజా సమస్యల పై బిఆర్ఎస్ దశల వారి ఉద్యమం
వెంకటాపురం : ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రము లోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి పూర్తిగా అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు గుడవర్తి నరసింహమూర్తి కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు."అబద్ధపు హామీలతో నమ్మించి, అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలను విస్మరించారు అని ,కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ,నెరవేర్చకపోతే గద్దె దింపుతాం" అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలను పాతరేసి, 420కు పైగా హామీలను బొందపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన ప్రజా కంటకంగా మారిందని, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులను నమ్మించి గొంతు కోశారని విమర్శించారు.ప్రతి హామీ నెరవేరే వరకు ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆగదని, వీధి వీధినా కాంగ్రెస్ నయవంచనను ఎండగడతామని స్పష్టం చేశారు.వెంకటాపురం మండలం లో నెలకొన్న ప్రధాన సమస్యలు రోడ్లు, విద్యుత్, రైతులకు సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు అవకతవకలు ఇసుక సోసైటిల్లో లోపాలపై, మండలంలో కొంతమంది ప్రధాన అధికారులు విధులకు సక్రమంగా రాకపోవటం పై,22 ఏ తో పాటు వివిధ ప్రజా సమస్యల పై రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం కార్యాచరణ రూపొందిస్తాం అని తెలిపారు.త్వరలో రాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికల్లో అర్హులను గుర్తించి ఓటు నమోదు ప్రక్రియ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిడెం రవికూమార్,అధికార ప్రతినిధి డర్రా దామోదర్,వెల్ఫూరి లక్ష్మి నారాయణ,జాగర శివాజీ, శాంతమూర్తి, మంచర్లనాగేశ్వరరావు,బట్ట నాగేంద్ర,గాడ్డం వివేక్, నాని నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


