ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి 

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి 

హన్మకొండ న్యూస్ : పరకాల ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  ప్రచారం నిర్వహించారు. రీజియన్ క్లాస్ సీరియల్ నెంబర్ 6, స్టేట్ క్లాస్ సీరియల్ నెంబర్ 3 బాణం గుర్తుపై ఓటు వేసి ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐక్య కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్క కార్మికుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా పనిచేస్తోందని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీ కార్మికుల ఎన్నికలను అడ్డుకుని, వారి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా నిలిచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా, టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో పరకాల ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేసి, కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. 

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News