ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 

హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  సోమవారం రోజున ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ నూతనంగా కళాశాల చేరిన విద్యార్థులలో బెరుకు, జంకును తొలగించడానికి మరియు కళాశాల నూతన వాతావరణానికి అలవాటు పడడానికి ఫ్రెషర్స్ డే తోడ్పడుతుందని తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి కళాశాల ప్రగతి పథంలో నడుస్తున్నదని తెలుపుతూ ఇటీవల కాలంలో పెరిగిన కళాశాల నమోదు శాతం దీనికి నిదర్శనం అని అన్నారు.  అదేవిధంగా జిజ్ఞాస పోటీలో విద్యార్థుల పరిశోధనా ప్రాజెక్టు రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచిందని తెలిపారు. కళాశాలలో ఉన్న వసతులను వివరిస్తూ విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు నగదు పారితోషకాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ ఈ కళాశాలను ఎంచుకోవడం ద్వారా విద్యతోపాటు సాంకేతిక మరియు జీవన నైపుణ్యాలను పొందుతున్నామని అధ్యాపకుల కృషిని కొనియాడా రు. వైష్ణవి మరియు మాధురి మధురమైన పాటలతో అందరినీ అలరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ