సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయండి
- ప్రతి శక్తికేంద్రం నుంచి 5. బైకులతో తరలిరావాలి
- బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపు
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బిజెపి శ్రేణులతో కలిసి సోమవారం రోజున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితంలో దేశానికి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పీఎం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అక్టోబర్ 7న చేపట్టనున్న సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ దేశానికి అంకితమైన సేవా ప్రస్థానానికి ప్రతీకగా పేదల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం వంటి అనేక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మోదీ గారి సేవా స్ఫూర్తికి కృతజ్ఞతగా సేవా జ్యోతి కలశం యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సేవా జ్యోతి కేవలం ఒక కార్యక్రమం కాదని,సేవ, త్యాగం, అంకితభావం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచే జాతీయ సంకల్పమని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి, సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మోదీ గారి సంకల్పానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నుంచి భారీ ర్యాలీ
అక్టోబర్ 7వతేదీన ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అసెంబ్లీ కేంద్రం నుంచి సేవా జ్యోతి కలశం యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. హుస్నాబాద్ అసెంబ్లీ పరిధిలోని అన్ని మండలాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 9 గంటలలోపే హుస్నాబాద్ పట్టణానికి చేరుకుని భారీ బైక్ ర్యాలీగా తరలిరావాలని కోరారు. హుస్నాబాద్‌తో పాటు జిల్లా కేంద్రంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చే కార్యకర్తల ర్యాలీలతో కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ జరు గుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ ఏర్పాటు చేసే ఎల్ఈడి స్క్రీన్ కేంద్రం వద్ద కార్యక్రమం కొనసాగుతుందని,అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సామూహికంగా వీక్షిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.ప్రతి శక్తికేంద్రం నుంచి 5. బైకులు తప్పకుండా రావాలని, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలోని శక్తికేంద్రాల వారీగా 5. బైకులు, ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక బైక్ చొప్పున సేవా జ్యోతి ర్యాలీకి తరలిరావాలని సూచించారు.ప్రత్యేకంగా హుస్నాబాద్ అసెంబ్లీ పరిధిలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం, అక్కన్నపేట,కోహెడ, చిగురుమామిడి,సైదాపూర్, బిందెవరపల్లి, ఎల్కతుర్తి మండలాల నుంచి బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలని కోరారు.మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా వికసిత్ భారత్–2047 సాధనకు సంకల్పంగా.. సేవా స్ఫూర్తిని ప్రతి గ్రామానికి చాటేలా సేవా జ్యోతి కలశం యాత్రను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎం సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ ఖమ్మం వేంకటేశం, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి తిరుమల రెడ్డి, హుస్నాబాద్, అక్కనపేట, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి బిజెపి మండల అధ్యక్షులు బుక్యా సంపత్ నాయక్, రామంచ మహేందర్ రెడ్డి, పోలోజు సంతోష్, దంచనాల శ్రీనివాస్, మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, బిజెపి ఎస్టిమోర్చా రాష్ట్ర అధికారప్రతినిది గుగ్లోత్ తిరుపతి నాయక్, ఓబీసీమోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, పట్టణ మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్దండి రాజేంద్రప్రసాద్, బొల్లి శ్రీనివాస్, పిల్లి నర్సయ్య, అచ్ఛ రవీందర్, కో అపరేటివ్ సెల్ జిల్లా కన్వీనర్ జనగామ వేణుగోపాల్ రావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు బైరి అరుణ్, మాడక రవికుమార్, పెరుమల్ల భరద్వాజ్, పెర్యాల సాగర్ రావు, వివిధ బాధ్యతల్లో ఉన్న పార్టీ శ్రేణులు కర్ణకంటి నరేష్, తగురం లక్ష్మణ్, నాగు అజయ్,దానవేని రాజయ్య, పుదారి కిష్టయ్య, బొల్లి సుధాకర్, కండే శంకర్, గంగూల కుమార్, తదితరులు హాజరయ్యారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


